బండ్లగూడ సీఐ, ఎస్సైపై సస్పెన్షన్ వేటు
Mar 27, 2024,
బండ్లగూడ సీఐ, ఎస్సైపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్‌లోని బండ్లగూడ సీఐ మహమ్మద్ షకీర్ అలీ, ఎస్సై వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేశ్‌లను నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. జనవరిలో వీరిపై ఓ మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు. సీపీకి నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి సీపీ నిర్ణయం తీసుకున్నారు.